Benjamin Netanyahu : పశ్చిమాసియా యుద్ధంలో తాత్కాలిక కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ లెబనాన్ (Lebanon)పై భీకర దాడులు కొనసాగించిన ఇజ్రాయేల్ శాంతి చర్చలకు సిద్దమని ప్రకటించింది. కాల్పుల విరమణలో లెబనాన్ కూడా భాగమేనని, దాడులు తగవని ఇరాన్ సహా పలు దేశాలు ఆగ్రహించిన నేపథ్యంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (Benjamin Netanyahu) చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే.. దౌత్యపరమైన ఒప్పందానికి బీరుట్ పదే పదే విజ్ఞప్తి చేయడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.
ఓవైపు అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదరగా.. ఇజ్రాయేల్ మాత్రం లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా క్షిపణులతో విరుచుపడింది. ఈ దాడుల కారణంగా బీరూట్‌లో 200ల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాంతో.. తమ దేశంపై హింసాత్మక దాడులు ఆపిన తర్వాతే చర్చల ప్రస్తావన తీసుకురావాలని లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అఓనా స్పష్టం చేశారు. ఆయన ప్రకటనతో అనంతరం మేము శాంతి చర్చలకు సిద్ధమేనని నెతన్యాహూ వెల్లడించారు.
Prime Minister Benjamin Netanyahu:
“In light of Lebanon’s repeated requests to open direct negotiations with Israel, I instructed at the Government meeting yesterday to open direct negotiations with Lebanon as soon as possible.
1/2
— Prime Minister of Israel (@IsraeliPM) April 9, 2026
‘ఇజ్రాయేల్‌తో నేరుగా చర్చలు జరపాలని భావిస్తున్నట్టు లెబనాన్ ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేసింది. అందుకని వీలైనంత త్వరగా ఆ దేశంతో శాంతి చర్చలు జరపాలని బుధవారం మా క్యాబినెట్‌ను ఆదేశించాను. హెజ్బొల్లాకు ఎలాంటి హానీ తలపెట్టకుండా.. లెబనాన్, ఇజ్రాయేల్ మధ్య శాంతి చర్చలు జరిగేలా చూస్తా’నని నెతన్యాహూ ఒక ప్రకటనలో తెలిపారు.