జెరుసలాం: దక్షిణ లెబనాన్‌లో ఏసు క్రీస్తు విగ్రహాన్ని ఓ ఇజ్రాయిలీ సైనికుడు ధ్వంసం చేసినట్లు ఫోటో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ ఘటన పట్ల ఇప్పటికే ఇజ్రాయిల్ రక్షణ దళం, విదేశాంగ మంత్రి క్షమాపణలు చెప్పారు. తాజాగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ(Benjamin Netanyahu) కూడా ఆ ఘటనను ఖండించారు. దక్షిణ లెబనాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఇజ్రాయిలీ సైనికుడు శిలువ వేసిన ఏసు విగ్రహన్ని ధ్వంసం చేసినట్లు సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అయ్యింది. అయితే మతసహనానికి విరుద్ధంగా ఆ సైనికుడి చర్యలు ఉన్నట్లు నెతన్యహూ పేర్కొన్నారు. ఓ క్యాథలిక్ మతానికి చెందిన విగ్రహన్ని ఐడీఎఫ్ సైనికుడు ధ్వంసం చేయడం తనను స్టన్‌కు గురిచేసిందని, ఆ ఘటన బాధగా ఉందని, చాలా కఠినమైన రీతిలో ఆ ఘటనను ఖండిస్తున్నట్లు తన ఎక్స్ అకౌంట్లో నెతన్యహూ రాశారు.
ఈ ఘటన పట్ల మిలిటరీ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారని, కఠినమైన క్రమశిక్షణ చర్యలను తీసుకుంటారని ఆయన అన్నారు. వివిధ మతాలను సమానంగా చూస్తామన్నారు. తమ నేలపై అన్ని మతాలు వర్థిల్లుతాయని, తమ దేశ, ప్రాంత నిర్మాణంలో భాగమైన అన్ని మతాలను సమానంగా ఆదరిస్తామన్నారు. సిరియా, లెబనాన్ దేశాల్లో క్రైస్తవులను ముస్లింలు హతమార్చుతున్నారని, కానీ పశ్చిమాసియాలోని ఇజ్రాయిల్‌లో మాత్రం క్రైస్తవ జనాభా క్షేమంగా ఉందన్నారు. కేవలం ఇజ్రాయెల్‌లో మాత్రమే క్రైస్తవుల జనాభా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడినట్లు చెప్పారు. పశ్చిమాసియా ప్రాంతంలోని ఇజ్రాయెల్‌లో మాత్రమే మతస్వేచ్ఛ ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటన పట్ల లెబనాన్‌తో పాటు ఇతర ప్రాంతాల ప్రజల మనోభావాలు దెబ్బతింటే, వారికి తాము క్షమాపణలు చెబుతున్నట్లు నెతన్యహూ తన ఎక్స్‌లో పేర్కొన్నారు.
As the Jewish state, Israel cherishes and upholds the Jewish values of tolerance and mutual respect between Jews and worshippers of all faiths. All religions flourish in our land and we view members of all faiths as equals in building our society and region.
Yesterday, like the…
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) April 20, 2026