Beavers | న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంలో ఆలస్యం జరిగితే, వాటి వ్యయ భారం పెరుగుతూ ఉంటుంది. కానీ చెక్ రిపబ్లిక్, బ్రిడీ రీజియన్లో ఓ ఆనకట్ట నిర్మాణంలో ఏడేళ్లు ఆలస్యమైనప్పటికీ, రూ.10 కోట్లు ఆదా అయింది. బీవర్స్ అనే ఎలుకల వంటి ఉభయచర జీవులు ఆనకట్ట నిర్మాణంలో సాయపడటమే దీనికి కారణమని అధికారులు చెప్పారు.
ప్రాజెక్టు డాక్యుమెంటేషన్ వంటివేవీ లేకుండానే అవి తమ కోసం పని చేశాయన్నారు. ఈ ప్రాజెక్టు సుదీర్ఘ కాలం చెక్కుచెదరదని తెలిపారు. ఈ ఎలుకలు పుల్లలు, మట్టి, రాళ్లతో ఈ ఆనకట్టను నిర్మించాయి. ఇది వాటికి సహజంగానే ఉండే లక్షణం.