అప్పటిదాకా అందరూ సర్కస్‌లో ఎంజాయ్ చేశారు. ఎలుగుబంటి విన్యాసాలకు చప్పట్లు కొట్టారు. కానీ, అక్కడ ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. ఎలుగుబంటి.. సర్కస్ ట్రైనర్‌పై తిరగబడింది. అతడిని కిందపడేసి రక్కుతూనే ఉంది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోను ‘యానిమల్స్ పవర్స్’ అనే యూజర్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ సంఘటన ఉత్తర రష్యాలో జరిగింది. సర్కస్ ఎలుగుబంటి తన ట్రైనర్‌పై దాడిచేసింది. పక్కనే ఉన్న మరో ట్రైనర్ దాన్ని కాలితో తన్ని లాగే ప్రయత్నం చేశాడు. అయినా, అది పట్టువీడలేదు. దీంతో దానికి కరెంట్ షాకిచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. ఎలుగుబంటి తన ట్రైనర్‌పై దాడిచేయగానే, అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన ప్రేక్షకులు భయంతో పరుగులు తీయడం కనిపించింది. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకూ ఈ వీడియోకు 1.76లక్షల వ్యూస్ వచ్చాయి.