ఎలుగు బంటులు ప్రమాదకరమైన జంతువులే కానీ.. అవి చేసే పనులు కొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తాయి. ఇలాంటిదే ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక ఎలుగు బంటి నెమ్మదిగా ఒక జారుడు బల్లపైకి ఎక్కింది. దాని మీది నుంచి జారి కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ.. జారుతూ కిందకు దిగింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
పోస్టు చేసినప్పటి నుంచి దీనికి 2 మిలియన్లపైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 67 వేల మంది దీనికి లైక్ కొట్టగా.. 8,300 షేర్ చేశారు. ‘ఎలుగులు ఒక్క దెబ్బతో మన తల బద్దలు చేయగలవు. అదే సమయంలో ఇలాంటి అమాయకంగా ఆడుకుంటూ కనిపిస్తాయి’అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. అది జారుకుంటూ ‘వీ’ అని అరుస్తుందని అనుకున్నానే అంటూ మరొకరు జోక్ చేశారు. ఏదేమైనా ఈ వీడియో నెట్టింట మాత్రం తెగ నవ్వులు పూయిస్తోంది.
Just a bear on a slide.. 😅 pic.twitter.com/QD4yqOwSkr
— Buitengebieden (@buitengebieden) September 15, 2022