లండన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రసంగాలతో రూపొందించిన డాక్యుమెంటరీ బీబీసీ(BBC) ఛానల్లో ప్రసారం అయ్యింది. అయితే ఆ డాక్యుమెంటరీలో ట్రంప్ ప్రసంగాన్ని తప్పుదోవ పట్టించే రీతిలో ప్రసారం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు బీసీసీ ఉన్నతోద్యోగులు రాజీనామా చేశారు. బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవ్‌తో పాటు న్యూస్ డివిజన్ సీఈవో డెబోర్నా టర్నెస్ రాజీనామా చేశారు.
2021, జనవరి 6వ తేదీన అమెరికాలో జరిగిన క్యాపిటల్ హింసకు ట్రంప్ పిలుపు ఇచ్చినట్లు ఆ డాక్యుమెంటరీలో ట్రంప్ ప్రసంగాన్ని ఎడిట్ చేశారు. దీని పట్ల ఆ ఇద్దరికీ మెమో జారీ చేశారు. రాజీనామా పూర్తిగా తన స్వంత నిర్ణయం అని దేవ్ తెలిపారు. ఓ డైరెక్టర్ జనరల్‌గా బీబీసీ చేసిన పొరపాటుకు పూర్తి బాద్యత తీసుకుంటున్నట్లు తన లేఖలో డేవ్ పేర్కొన్నారు.
బీసీసీలో ప్రసారం అయ్యే పనోరమా సిరీస్‌లో డాక్యుమెంటరీని ప్రసారం చేశారు. ఆ సిరీస్‌తో బీబీసీ సంస్థకు నష్టం జరుగుతున్నట్లు న్యూస్ డివిజన్ సీఈవో తెలిపారు. బీబీసీలోని ఇద్దరు టాప్ ఉద్యోగులకు మెమో జారీ చేసిన అంశంపై టెలిగ్రాఫ్ పత్రికలో కథనం రావడంతో ఆ ఇద్దరూ అధికారికంగా రాజీనామా అందజేశారు.