న్యూయార్క్, ఆగస్టు 6: వ్యర్థాలతో బ్యాటరీలు తయారు చేసి.. కాలం చెల్లిన తర్వాత ఆ బ్యాటరీల వ్యర్థాలను తిరిగి మొక్కలకు ఎరువులుగా వాడుకునే వెలుసుబాలు ఉంటే? ఊహించడానికే కొత్తగా ఉంది కదూ. ఇది త్వరలో నిజం కానున్నది. పర్యావరణ హితమైన బ్యాటరీల తయారీపై అమెరికాకు చెందిన సోర్బీఫోర్స్ అనే సంస్థ దృష్టిసారించింది. ఈ బ్యాటరీలు కాలం చెల్లిన తర్వాత సులువుగా మట్టిలో కలిసిపోతాయి. మొక్కలకు ఎరువులుగా కూడా వీటిని వినియోగించే వీలుండటం మరో సానుకూలాంశం. త్వరలోనే వీటిని మార్కెట్లో చూసే అవకాశం ఉన్నది.