Bank collapse In Paraguay | బ్యాంకు పతనంతో నిరసనలు.. పరాగ్వే అధ్యక్షుడు గృహ నిర్బంధం
Bank collapse In Paraguay | దక్షిణ అమెరికా దేశమైన పరాగ్వేలోని అతి పెద్ద బ్యాంకు పతనమైంది. దీంతో ఆ దేశంలోని సగం మంది ప్రజలకు నిధులు అందుబాటులో లేకుండా పోయాయి. పరాగ్వేను ఆర్థిక, రాజకీయ సంక్షోభంలోకి ఇది నెట్టింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిపై అభిశంసన చర్యలు చేపట్టడంతో పాటు గృహ నిర్బంధం చేశారు.
అసున్సియోన్: దక్షిణ అమెరికా దేశమైన పరాగ్వేలోని అతి పెద్ద బ్యాంకు పతనమైంది. దీంతో ఆ దేశంలోని సగం మంది ప్రజలకు నిధులు అందుబాటులో లేకుండా పోయాయి. పరాగ్వేను ఆర్థిక, రాజకీయ సంక్షోభంలోకి ఇది నెట్టింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిపై అభిశంసన చర్యలు చేపట్టడంతో పాటు గృహ నిర్బంధం చేశారు. (Bank collapse In Paraguay గ్రూపో వాజ్క్వెజ్ వ్యాపార సముదాయం నియంత్రణలో ఉన్న డిజిటల్ రుణదాత అయిన యూనో బ్యాంక్ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా క్షీణించినట్లు నియంత్రణ సంస్థలు గుర్తించాయి. నవంబర్ 3న పరాగ్వే సెంట్రల్ బ్యాంక్ ఈ బ్యాంక్‌ను తన నియంత్రణలోకి తీసుకున్నది. దీంతో 65 లక్షల జనాభా ఉన్న ఆ దేశంలో సుమారు 30 లక్షలకు పైగా బ్యాంకు వినియోగదారులు తమ పొదుపు డబ్బు పొందలేని పరిస్థితి ఏర్పడింది.
కాగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మాజీ ఆర్థికవేత్త, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్రుడైన పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనా గతంలో ఈ బ్యాంక్ గ్రూప్‌లో వాటా కలిగి ఉన్నారు. దీంతో యూనో బ్యాంక్ విస్తరణకు ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభంతో పాటు అధ్యక్షుడిపై ఆ దేశవ్యాప్తంగా ప్రజల నిరసనలు మిన్నంటాయి.
మరోవైపు ఈ సంక్షోభం నేపథ్యంలో నవంబర్ 5న అధ్యక్షుడు శాంటియాగో పెనా తన రాజీనామాను ప్రకటించారు. అయితే చట్టసభ సభ్యులు దీనికి అంగీకరించలేదు. అధికార దుర్వినియోగం ఆరోపణలపై నవంబర్ 7న అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానాన్ని పరాగ్వే సెనేట్ ఆమోదించింది. దీంతో పెడ్రో అలియానా ఆయన వారసుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అభిశంసన జరిగిన కొద్ది నిమిషాలకే పెనాను అదుపులోకి తీసుకుని గృహనిర్బంధంలో ఉంచారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- bank
- Collapse
- House Arrest
- Paraguay
RELATED ARTICLES
తాజా వార్తలు
Bank collapse In Paraguay | బ్యాంకు పతనంతో నిరసనలు.. పరాగ్వే అధ్యక్షుడు గృహ నిర్బంధం
Health tips | డయాబెటిస్ ఉన్నవాళ్లు కార్న్‌ఫ్లేక్స్ తినొద్దా.. తింటే ఏం జరుగుతుంది..!
MLA Komatireddy | కొడంగల్‌కు ఫుల్ నిధులు..మునుగోడుకు నిల్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLC Dasoju Shravan Kumar | పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్‌ను రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
House Slab Collapses | నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలి కార్మికుడు మృతి.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

