ఢాకా, మే 28: ముహమ్మద్ యూనస్ సారథ్యంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషలిస్టు పార్టీ(బీఎన్పీ) ఒత్తిడి పెంచింది. డిసెంబర్ కల్లా దేశంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాం డు చేస్తూ వేలాది మంది యువజనులు, బీఎన్పీ కార్యకర్తలు బుధవారం ఢాకాలో ప్రదర్శన నిర్వహించారు. డిసెంబర్ కల్లా జా తీయ ఎన్నికలు జరగాలని, వెంటనే ఇందు కు సన్నాహాలు ప్రారంభించాలని బీఎన్పీ తాత్కాలిక చైర్మన్ తారీఖ్ రెహ్మాన్ డిమాండు చేశారు. లండన్ నుంచి వర్చువల్గా ఆయన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.
యూనస్ ఆశీస్సులతో కొత్తగా విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పడిన నేషనల్ సిటిజెన్ పార్టీకి వ్యతిరేకంగా తమ బలాన్ని ప్రదర్శిస్తూ వేలాది మంది విద్యార్థులు నేటి ర్యాలీలో పాల్గొన్నారు. ఇలా ఉండగా అధికారిక పర్యటన నిమిత్తం ప్రస్తుతం జపాన్లో ఉన్న యూనస్ బుధవారం ఎన్నికలపై తన వైఖరిని పునరుద్ఘాటించారు. సంస్కరణల అమలు తీరును బట్టి ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది జూన్ మధ్యలో ఎన్నికలను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.