IPL Matches : ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందడికి తెరలేవనున్న వేళ బంగ్లాదేశ్ (Bangladesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమదేశంలోని క్రికెట్ అభిమానులకు తీపి కబురు చెబుతూ.. ఐపీఎల్ మ్యాచ్‌లపై నిషేధాన్ని ఎత్తేసింది. భారతదేశంతో దౌత్య సంబంధాలు పునరుద్ధరణలో భాగంగా బంగ్లాదేశ్ కొత్త సర్కార్ ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాలకు ఆమోద ముద్ర వేసింది. ఈ విషయాన్ని శనివారం సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రి జహీర్ ఉద్ధీన్ స్వప్నన్ (Zahir Uddin Swapan) వెల్లడించారు.
భారత్‌తో క్రికెట్ సంబంధాల పునరుద్ధరణకు నిరీక్షిస్తున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ దిశగా తొలి అడుగు వేసింది. రెహమాన్ తారీఖ్ సారథ్యంలోని కొత్త సర్కార్ ఐపీఎల్ ప్రసారాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ఆ దేశ సమాచార శాఖ మంత్రి జహీర్ ఉద్దీన్ స్వప్నన్ ఈ విషయాన్ని అధికారంగా ప్రకటించారు.
🚨 BCB ALLOW IPL STREAMING IN
BANGLADESH !! 🚨 [ Cricbuzz]Minister -“We doesn’t want to add politics in sports, If Star sports wants to telecast IPL in bangladesh that’s no problem for us
Another Surrender from Bangladesh against India 🤯 pic.twitter.com/rj6ZjF8HpN
— Indian Cricket Netwrk (@ICN_Updates01) March 28, 2026
‘ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయాలని ఏ ఒక్క టీవీ ఛానెల్ యాజమాన్యం మాకు దరఖాస్తు ఇవ్వలేదు. రాజకీయాలతో క్రికెట్‌ను ముడిపెట్టడం మాకు నచ్చదు. ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారం అంశాన్ని మేము వాణిజ్య కోణంలో చూస్తున్నాం. ఏ ఛానెల్ వారైనా ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాల అనుమతి కోరితే.. మేము అంగీకరిస్తాం. మేము ఎవరినీ ఐపీఎల్ ప్రసారం చేయకుండా అడ్డుకోం. స్టార్ స్పోర్ట్స్ సంస్థ ప్రసారం చేయాలనుకుంటే వారికి అభ్యంతరం చెప్పం. అలాగనీ కచ్చితంగా ఐపీఎల్ మ్యాచ్‌లను టెలికాస్ట్ చేయాలని మేము ఎవరినీ బలవంతం చేయం’ అని మీడియా సమావేశంలో జహీర్ ఉద్దీన్ వెల్లడించారు.
నిరుడు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఆ దేశ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్(Mustafizur Rehaman)పై బీసీసీఐ వేటు వేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీని ముస్తాఫిజుర్‌ను విడుదల చేయాలని ఆదేశించింది. తమ పేసర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడంపై ఆగ్రహించిన మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాలపై నిషేధం విధించింది.

అంతేకాదు.. భద్రతా కారణాలతో భారత్‌లో పొట్టి ప్రపంచకప్ ఆడబోమని ఐసీసీకి తేల్చి చెప్పింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. ఐసీసీ బృందం చర్చించినా మాట వినని బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించిన ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్కు అవకాశమిచ్చింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చెప్పుడు మాటలు విని వరల్డ్‌కప్ ఆడకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయిన బీసీబీ, ఆ దేశ ప్రభుత్వం భారత్‌తో మునపటిలా సఖ్యతతో మెలగాలని నిర్ణయించుకుంది.