ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. మైమెన్సింగ్, దినాజ్‌పూర్ జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో మూడు ఆలయాలపై దుండగులు దాడికి తెగబడి, ఎనిమిది విగ్రహాలను ధ్వంసం చేశారు. అలాలుద్దిన్ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఢిల్లీలోని పాఠశాలల్లో బంగ్లాదేశ్‌కు చెందిన పిల్లలు ఉన్నారేమో గుర్తించాలని పాఠశాలలకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) సర్క్యులర్ జారీ చేసింది. ఎవరైనా ఉంటే తెలియజేయాలని ఆదేశించింది.