ఢాకా: ఇస్కాన్ మాజీ నేత చిన్మయ్ కృష్ణ దాస్‌కు బెయిలు మంజూరు చేసేందుకు బంగ్లాదేశ్ కోర్టు గురువారం తిరస్కరించింది. విచారణ సందర్భంగా ఆయన తరపున 11 మంది న్యాయవాదులు బెయిలు దరఖాస్తుతో హాజరయ్యారు.
ఈ విచారణకు దాస్ వర్చువల్ విధానంలో హాజరయ్యారు. ఆయన దేశద్రోహానికి పాల్పడినట్లు ఆరోపణలు నమోదైన సంగతి తెలిసిందే. మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి మహమ్మద్ సైఫుల్ ఇస్లాం ఇరు పక్షాల వాదనలను విన్న తర్వాత బెయిలును తిరస్కరించారు.