న్యూఢిల్లీ: ప్రత్యేక దేశం కోసం ఏండ్లుగా పోరాడుతున్న పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎల్ఏ) మంగళవారం పొద్దుపోయాక భీకర దాడులకు దిగింది. బలూచిస్థాన్‌లోని పలు జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడింది.
‘ఆపరేషన్ బామ్'(డాన్)లో భాగంగానే ఈ దాడులకు పాల్పడినట్టు పీఎల్ఏ ప్రకటించింది. పాకిస్థాన్‌తో దశాబ్దాలుగా జరుగుతున్న పోరులో ఇది సరికొత్త అధ్యాయమని పేర్కొంది. మొత్తం 17 చోట్ల దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో సమాచార వ్యవస్థ, మిలిటరీ స్థావరాలు, ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసమైనట్టు వివరించింది.