మనామా: బహ్రెయిన్‌లో చాలా కాలంగా నిర్వహిస్తున్న భారతీయ రెస్టారెంట్ మూతపడింది. ముసుగు ధరించి వచ్చిన ఒక మహిళ లోనికి ప్రవేశించడాన్ని రెస్టారెంట్ సిబ్బంది నిరాకరించడమే దీనికి కారణం. బహ్రెయిన్‌లోని అడ్లియాలో ఈ ఘటన జరిగింది. ఇక్కడున్న ఒక ప్రముఖ ఇండియన్ రెస్టారెంట్‌ను 1987 నుంచి నిర్వహిస్తున్నారు. కాగా, ఇటీవల ఒక మహిళ ముసుగు ధరించి రెస్టారెంట్‌కు వచ్చింది. దీంతో అక్కడి సిబ్బంది ఆమెను రెస్టారెంట్లోకి అనుమతించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దీంతో బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ అథారిటీ (బీటీఈఏ) అధికారులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. పర్యాటక ఔట్‌లెట్లన్నీ తప్పక తమ దేశ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ‘ప్రజల పట్ల వివక్ష చూపే అన్ని చర్యలను మేం తిరస్కరిస్తాం. ముఖ్యంగా తమ జాతీయ గుర్తింపునకు సంబంధించిన వివక్షను తీవ్రంగా పరిగణిస్తాం’ అని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలను తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు.
అలాగే నిబంధనలు ఉల్లంఘించిన ఇండియన్ రెస్టారెంట్‌పై దర్యాప్తు జరిపి చర్యలు చేపట్టారు. దీంతో ఆ రెస్టారెంట్‌ను మూసివేశారు. కాగా, ఈ ఘటనపై ఆ భారతీయ రెస్టారెంట్ క్షమాపణలు చెప్పింది. ఈ అందమైన రాజ్యంలోని అన్ని దేశాలకు చెందిన తమ కస్టమర్లకు 35 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నట్లు తెలిపింది. బాధ్యుడైన డ్యూటీ మేనేజర్‌ను తొలగించినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.