బాగ్దాద్: అవినీతిపై ఉక్కుపాదం లక్ష్యంగా అవినీతి ఎంపీలు, నేతలు, అధికారులపై ఇరాక్ అవినీతి నిరోధక శాఖాధికారులు జరుపుతున్న దాడుల్లో వేల కోట్ల రూపాయల అక్రమ, అవినీతి సొమ్ము బయటపడింది. కట్టల కట్టల నగదు, కుప్పలు కుప్పలుగా దాచి ఉంచిన బంగారు నగలు, వజ్రాలు, భూములు, ఆస్తులు, వాహనాలు చూసి అధికార యంత్రాంగం ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. ఇప్పటివరకు రూ. 2,700 కోట్ల అవినీతి సొమ్మును సీజ్ చేశారు.
తాజాగా మాజీ అధికారిణి అలియా నస్సీఫ్, ఆమె కుమారుడి ఇంటి నుంచి అధికారులు 20 బిలియన్ ఇరాకీ దినార్ల (సుమారు రూ. 146 కోట్లు)తో పాటు పెద్దమొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మేలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అలీ అల్ జియాదీ దేశంలోని అవినీతి నెట్వర్క్లపై ఉక్కుపాదం మోపుతానని ప్రజలకు హామీ ఇచ్చారు.