మంగళవారం 27 అక్టోబర్ 2020
International - Sep 27, 2020 , 22:00:54

బాత్‌టబ్‌లో చిన్న ఏనుగు భలే ముద్దుగా స్నానం చేసింది..!

బాత్‌టబ్‌లో చిన్న ఏనుగు భలే ముద్దుగా స్నానం చేసింది..!

హైదరాబాద్‌: జంతువుల చిలిపిచేష్టలు భలేగా ఉంటాయి. కుక్కలు, పిల్లులు, ఏనుగుల వీడియోలు ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరల్‌ అవుతాయి. ఇటీవల ఓ బుల్లి ఏనుగు బాత్‌టబ్‌లో తనను తాను మైమరచిపోయి స్నానం చేసింది. ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. దీన్ని చూసినవారంతా సరదా కామెంట్లు పెడుతూ సందడి చేస్తున్నారు. 

38 సెకన్ల నిడివి గల ఈ ఆనందకర వీడియోను సైమన్ హాప్కిన్స్ అనే ఫుట్‌బాల్ ప్లేయర్ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. చిన్న ఏనుగు వాటర్‌టబ్‌ వద్దకు వస్తుంది. మెళ్లగా నీళ్లు పైన పోసుకుంటుంది. దానికేమనిపించిందో ఏమో ఆ టబ్‌లోకి అడుగిడింది. అందులో అటూఇటూ బొర్లుతూ స్నానం చేసింది. అందులోనే విశ్రాంతి తీసుకుంది. ఈ వీడియోను పోస్ట్‌ చేసిన హాప్కిన్స్‌ దీనికి ‘బాత్‌ టైమ్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. దీనిని ఇప్పటివరకు మైక్రోబ్లాగింగ్ సైట్‌లో 2000 కంటే ఎక్కువ మంది వీక్షించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo