న్యూఢిల్లీ : లతా మంగేష్కర్ ఎవర్గ్రీన్ సాంగ్ మేరా దిల్ యే పుకారే ఆజా సాంగ్ రీమిక్స్‌తో ఓవర్‌నైట్‌లో ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన పాకిస్తాన్ బాలిక ఆయేషా మరో పెర్ఫామెన్స్‌తో నెటిజన్లను ఆకట్టుకుంది. ఆయేషా తాజాగా హర్యాన్వి సాంగ్‌కు లిప్ సింకింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఆ వీడియో వైరల్‌గా మారింది.
గ్రీన్ చుడీదార్లో ముస్తాబైన ఆయేషా తేరే చక్కర్ మే సాంగ్‌కు లిప్ సింకింగ్ చేసింది. ఖాసా అల చహర్, ప్రంజల్ దహియ, ఉపాసన గహ్లోట్ ఆలపించిన ఈ హుషారైన సాంగ్‌కు ఆయేషా క్యూట్ లిప్ సింక్ స్టైల్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఈ వీడియోకు ఆయేషా దిల్ తో తు పెహ్లా హి లేగయా అని క్యాప్షన్ ఇచ్చింది.
ఈ వీడియో ఇప్పటికే 8లక్షలకు పైగా వ్యూస్‌ను రాబట్టి మిలియన్ వ్యూస్ మార్క్ దిశగా పరుగులు పెడుతోంది. వీడియోలో ఆయేషా సింప్లిసిటీని మెచ్చుకున్న నెటిజన్లు ఆమె ఇన్‌స్టా రీల్స్‌ను ఎంతో ఇష్టంగా చూస్తుంటామని కామెంట్ చేశారు. తేరే చక్కర్ మే ఈ ఏడాది డిసెంబర్ 7న విడుదల కాగా ఖాసా అల చహర్, డీజే స్కై మ్యూజిక్ కంపోజ్ చేశారు.