Bangladesh : మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheik Hasina)కు ఉరిశిక్ష విధించడంపై ఆమె మద్దతుదారులు భగ్గుమంటున్నారు. తమ పార్టీ అధినేత్రికి నవంబర్ 17న విధించిన మరణ శిక్ష చట్ట విరుద్ధమని మండిపడుతున్నారు. బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు యూనుస్‌ను హంతకుడితో పోలుస్తున్న బంగ్లాదేశ్ అవామీ లీగ్ (Bangladesh Awami League) మంగళవారం దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. అంతేకాదు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు అవామీ లీగ్ నేతలు.
నిరుడు ఆగస్టులో నిరసనకారులను అణచివేసేందుకు హేక్ హసీనా క్రూరంగా వ్యవహరించారని, మానవత్వాన్ని ఆందోళనకారులను చంపేయాలని ఆదేశాలు ఇచ్చారని ఇటీవల అంతర్జాతీయ నేర విచారణ కోర్టు పేర్కొంది. మృతికి కారణమైన ఆమెకు మరణశిక్ష విధిస్తూ నవంబర్ 17న తీర్పునిచ్చింది. హసీనాకు ఉరి శిక్ష వేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆమెకు ఉరి చట్టవిరుద్ధమంటూ మద్దతుగా బంగ్లాదేశ్ అవామీ లీగ్ నిరసనలు తెలిపింది. మాజీ ప్రధానికి ఉరిని ఖండించిన అవామీ లీగ్ నవంబర్ 25 నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చింది. నవంబర్ 30 వరకూ హసీనాకు సంఘీభావంగా ర్యాలీలు, నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది.
Bangladesh Awami League’s Continuous Programs
Demanding the Resignation of Illegal Usurper, Killer–Fascist Yunus and Rejecting the Verdict of the Illegal ICT Tribunal
— Protest, demonstration and resistance marches across all districts and upazilas until 30 November⸻
Dear… pic.twitter.com/y9KHOJDKaS
— Bangladesh Awami League (@albd1971) November 25, 2025
అంతేకాదు యూనస్‌ను దోపిడిదారుగా పేర్కొన్న అవామీ నేతలు.. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ‘అక్రమంగా అధికారంలోకి వచ్చిన యూనస్ వెంటనే రాజీనామా చేయాలి. అంతర్జాతీయ నేర విచారణ కోర్టు హసీనాకు విధించి ఉరి శిక్షను తిరస్కరిస్తున్నాం. ప్రజలారా యూనస్ ప్రోద్భలంతో హసీనాకు చట్టవిరుద్ధంగా కోర్టు మరణశిక్ష విధించడం మీరంతా చూశారు. కాబట్టి.. మీరంతా ఆమె మరణ శిక్షను ఖండిస్తూ ఎక్కడ వీలైతే అక్కడ ఆందోళనలు నిర్వహించండి’ అని అవామీ లీగ్ తమ ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చింది.
బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడైన షేక్ ముజిబుర్ రెహ్మాన్(Sheikh Mujibur Rahman) వారసురాలైన షేక్ హసీనా తండ్రిలానే రాజకీయాల్ని పుణికిపుచ్చుకున్నారు. ఆయన మరణం తర్వాత అవామీ లీగ్ బాధ్యతలు చేపట్టిన ఆమె.. 1996లో బంగ్లాదేశ్ ప్రధాని పదవి చేపట్టారు. మొదట్లో జనాకర్షక నేతగా ప్రశంసలు అందుకున్న ఆమె.. పదిహేనేళ్లు పదవిలో ఉండడంతో నియంతగా ప్రవర్తించడం మొదలెట్టారు. అయితే.. 1971లో జరిగిన బంగ్లా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారి బంధువులకు సివిల్ ఉద్యోగాల్లో మూడు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం తన మెడకు చుట్టుకుంటుందని అస్సలు ఊహించలేదామె. ఈ నిర్ణయంతో జనంలో తీవ్రమైన వ్యతిరేకత పెల్లుబికింది.
యూనివర్సిటీ విద్యార్దులు శాంతియుతంగా నిరసనకు దిగారు. క్రమంగా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దాంతో.. ఆందోళనకారులను అణిచివేసేందుకు వారిని చంపడానికైనా వెనుకాడవద్దని హసీనా ఆదేశించిందని ఆరోపించింది నోబెల్ గ్రహీత యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం. హసీనాపై నమోదైన అభియోగాలపై అక్టోబర్ 23న విచారణ చేపట్టిన అంతర్జాతీయ క్ర్రైమ్స్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పును మొదట నవంబర్ 14న వెల్లడిస్తామని తెలిపింది. అయితే.. అనూహ్యంగా తీర్పు తేదీని నవంబర్ 17కు మార్చింది.
Once called the Iron Lady of Asia, Sheik Hasina was slapped with a death sentence for crimes against humanity. The legacy has turned rusty. Hashina was charged with her role in the deadly crackdown of student protests in 2024. Hashina is currently exiled in India. The case can… pic.twitter.com/axnZQvAblA
— DeusXMachina (@DeusXMachina14) November 17, 2025
న్యూక్లియర్ సైంటిస్ట్ ఎంఏ వాజెద్ మియా (Wazed Miah)ను 1967లో ఇదే రోజున హసీనా పెళ్లి చేసుకున్నారు. మొదట్లో కరాచీలోని అణుపరిశోధక సంస్థలో పనిచేసిన ఆయనను బంగ్లా విమోచన పోరాటానికి ముందే పాక్ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఆ తర్వాత ఈస్ట్ బెంగాల్(ప్రస్తుత బంగ్లాదేశ్)కు తిరిగొచ్చిన వాజెద్.. స్వాతంత్య్రం తర్వాత బంగ్లాదేశ్ అణుశక్తి కమిషన్‌లో సేవలందించారు.