సిడ్నీ : ఉద్యోగినితో అఫైర్ మరో సీఈవో ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన సూపర్ రిటైల్ గ్రూప్ సీఈవో ఆంథోని హెరాగ్టీని విధుల నుంచి తప్పించినట్టు సంస్థ మంగళవారం ప్రకటించింది.
కంపెనీ మాజీ హెచ్ఆర్ అధికారితో ఉన్న ప్రేమ సంబంధాన్ని వెల్లడించకుండా రహస్యంగా ఉంచిన క్రమంలో ఆంథోనిపై ఈ చర్య తీసుకున్నారని స్కైన్యూస్ ఆస్ట్రేలియా ప్రకటించింది.