కేవలం రెండు రోల్స్, రెండు కప్పుల కాఫీకి ఏకంగా 77 ఆస్ట్రేలియన్ డాలర్లు (దాదాపు రూ. 4000) వసూలు చేయడంతో ఆస్ట్రేలియన్ కస్టమర్ కంగుతిన్నారు. రెడిట్ యూజర్ లీ డార్విన్‌లోని ఓ బీచ్‌సైడ్ కేఫ్‌లో రెండు బ్యాకన్, ఎగ్ రోల్స్ ఆర్డర్ చేశారు. వాటికి అవకాడోలను యాడ్ చేయాలని కోరారు. ఆపై ఐస్‌క్రీంతో రెండు ఐస్డ్ కాఫీలు ఆర్డర్ చేశారు.
ఆపై రెస్టారెంట్ తనకు ఇచ్చిన బిల్ చూసి లీ గుండె గుభిల్లుమంది. ఆరోజు ఆదివారం కావడంతో ఏడు ఆస్ట్రేలియన్ డాలర్లను సండే సర్‌ఛార్జ్‌గా వసూలు చేసినట్టు గుర్తించారు. ఇక రోల్స్ ఒక్కోటి 19 డాలర్లు ఛార్జ్ చేయగా అవకాడోకు 3 డాలర్లు వసూలు చేశారు. ఒక్కో కాఫీ 10 డాలర్లు కాగా, ఐస్‌క్రీం మరో 6 డాలర్లు కలుపుకుని మొత్తం బిల్లు 77 ఆస్ట్రేలియన్ డాలర్లకు చేరింది.
బిల్లు చెల్లించిన తర్వాత కానీ బాదుడు విషయం లీకి అర్ధం కాలేదు. లీ తన అనుభవాన్ని రెడిట్‌లో పోస్ట్ చేశారు. దీనిపై రెడిట్ యూజర్లు రియాక్టయ్యారు. సండే సర్‌చార్జ్ లేకపోయినా ఇది ఖరీదైన బ్రేక్‌ఫాస్ట్ అని ఒకరు కామెంట్ చేయగా ఐస్డ్ కాఫీకి 13 డాలర్లు చాలా ఎక్కువని మరొకరు కామెంట్ చేశారు. నాకైతే ఆ డబ్బుతో వారం గడుస్తుందని మరొకరు కామెంట్ చేశారు.
Read More :
E-Vehicle Policy: ఈ-వెహికల్ విధానాన్ని ఆమోదించిన కేంద్రం