కాన్బెర్రా: తమ దేశంలో 16 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా ఆస్ట్రేలియా చట్టం చేసింది. ఈ చట్టాన్ని సెనేట్‌లో 19 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించగా 34 మంది ఆమోదించారు. ప్రతినిధుల సభలో 13 మంది మాత్రమే బిల్లును వ్యతిరేకించగా ఏకంగా 102 మంది ఆమోదం తెలిపారు.
దీంతో పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం చేసిన మొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో 16 ఏండ్ల లోపు పిల్లలకు అకౌంట్లు ఉండకుండా చూడటంలో విఫలమైతే ఆయా సోషల్ మీడియా సంస్థలకు 33 మిలియన్ అమెరికన్ డాలర్ల వరకు జరిమానా విధించేలా చట్టంలో పొందుపరిచారు.