మైక్రోటియా.. అంటే బాహ్య చెవులు అభివృద్ధి చెందకపోవడం. ఇది పుట్టుకతో వచ్చే వైకల్యం. ఈ వ్యాధితో బాధపడుతున్నవారికి బయటి చెవులుండవు. దీనికి ఇప్పటిదాకా శస్త్రచికిత్స లేదు. అయితే, ప్రపంచంలోనే తొలిసారి అమెరికా వైద్యులు దీనికి పరిష్కారం కనుగొన్నారు. మైక్రోటియా వ్యాధితో పుట్టిన 20 ఏళ్ల యువతికి 3డీ ప్రింటెడ్ టెక్నాలజీతో బాహ్యచెవిని అమర్చారు. ప్రపంచంలోనే ఇది తొలిసారికావడం విశేషం.
‘అవురినోవో ఇంప్లాంట్’గా పిలిచే ఈ టెక్నాలజీని 3డీ బయో థెరఫ్యూటిక్స్ సంస్థ రూపొందించింది. మొదటి క్లినికల్ ట్రయల్‌లో వైద్యులు రోగి సొంత మృదులాస్థి కణాలను ఉపయోగించి బాహ్య చెవిని పునర్నిర్మించారు. 3డీ ప్రింటెడ్ టెక్నాలజీతో రోగికి సరిపోయే పరిమాణం, ఆకృతిలో బాహ్య చెవిని ముద్రించారు. అనంతరం దానిని విజయవంతంగా ఆ యువతికి అమర్చారు. ఇది ‘గ్రౌండ్‌బ్రేకింగ్ రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్’ అని 3డీ బయో ఒక ప్రకటనలో తెలిపింది.