Israel | గాజా : ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో గాజాలో 93 మంది పౌరులు మరణించారు. గాజా శివార్లలోని దేర్ అల్ బలాహ్, ఖాన్ యూనిస్ నగరంతో సహా గాజావ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఇజ్రాయెల్ సేనలు వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడులలో కనీసం 93 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ మినహా గల్ఫ్ దేశాలలో జరిపిన పర్యటన ముగిసిన నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్ దాడులు జరిగాయి. గాజా స్ట్రిప్ సరిహద్దులపై ఇజ్రాయెల్ దిగ్బంధం మూడు నెలలుగా సాగుతోంది.