బొగోటా: కొలంబియాలో జరుగుతున్న ఘర్షణల్లో సుమారు 80 మంది మరణించగా, 20 మంది గాయపడ్డా రు. ప్రభుత్వం, జాతీయ విముక్తి సై న్యం (ఈఎల్ఎన్) మధ్య శాంతి చర్చలకు జరుగుతున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. నార్త్ శాంటాండెర్లో ఎ క్కువ మంది మరణించినట్లు గవర్నర్ విలియం తెలిపారు. శాంతి ఒప్పందం కోసం ప్రయత్నించిన నేత కార్మెలో కూ డా మరణించారు.
శాంతి చర్చల కో సం ప్రయత్నించిన ముగ్గురిని కిడ్నాప్ చేశారని అధికారులు చెప్పారు. కొలంబియా ఈశాన్య ప్రాంతం నుంచి వేలా ది మంది పారిపోతున్నారు. కొందరు సమీపంలోని కొండల్లో దాక్కుంటున్నారు. అన్ని రకాల దాడులను ఆపేయాలని ఈఎల్ఎన్ను కొలంబియా ప్రభుత్వం డిమాండ్ చేసింది.