e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 24, 2022
Home News Turkey Floods : టర్కీలో వరదలు : 44 మంది దుర్మరణం

Turkey Floods : టర్కీలో వరదలు : 44 మంది దుర్మరణం

బోజ్‌కార్ట్ : టర్కీలో భారీ వర్షాలు, వరదలు (Turkey Floods) ముంచెత్తుతున్నాయి. పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తుండటంతో టర్కీలోని పలు ప్రాంతాలు జలమయంగా తయారయ్యాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న కుంభవృష్టి కారణంగా వరదలు చుట్టుముట్టాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 44 మంది చనిపోయారు. కనిపించకుండా పోయిన వారి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వరదల కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తర నల్ల సముద్రం ప్రాంతంలో వరదల కారణంగా కనీసం 44 మంది మరణించారు. ఈ నెలలో దేశంలో సంభవించిన రెండవ ప్రకృతి విపత్తు. నల్ల సముద్రం బోజ్‌కుర్ట్‌ భారీ నష్టాన్ని చవిచూసింది. బోజ్‌కర్ట్‌ సహా కస్తామోను జిల్లాలో వరదల కారణంగా 36 మంది మరణించగా, సినోప్‌లో మరో ఏడుగురు, బార్టిన్‌లో ఒకరు మరణించినట్లు విపత్తు, అత్యవసర నిర్వహణ డైరెక్టరేట్ తెలిపింది. స్వాలో నది ఒడ్డున కూలిన ఒక భవనంలో 10 మంది చిక్కుకుపోయి మరణించినట్లుగా అధికారులు భావిస్తున్నారు. వేగంగా వస్తున్న వరద నీటితో అనేక ఇతర అపార్ట్‌మెంట్ బ్లాకుల పునాదులు కొట్టుకుపోయాయి. కాలాబాలిక్ చుట్టుపక్కల నివాసితులు తప్పిపోయిన తమ వారి గురించి అధికారుల వద్ద ఆరా తీస్తూ కనిపించారు. ముఖ్యంగా జర్నలిస్టులను చుట్టుముట్టి చనిపోయినవారి వివరాలు సేకరిస్తున్నారు.

- Advertisement -

ఇలాఉండగా, ఉత్తర ప్రావిన్స్‌లోని అడవుల్లో వారం క్రితం వరకు కార్చిచ్చు రగలగా.. ఇప్పుడు వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఇలాఉండటా, బోజ్‌కర్ట్‌ ప్రాంతంలో గత మూడు రోజుల్లో 45 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. బోజ్‌కుర్ట్ అనే చిన్న పట్టణం నల్ల సముద్రం నుంచి 2.5 కి.మీ దూరంలో ఉన్న కస్తామోను ప్రావిన్స్‌లోని ఎజైన్ నది ఒడ్డున ఉన్న లోయలో ఉన్నది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా కార్లు, వాహనలు మునిగిపోయి కనిపించాయి. వంతెనలు, రోడ్లపై బురద నిండిపోయి ఉన్నది. విద్యుత్‌ సరఫరా ఇంకా మెరుగవ్వలేదు. తాగునీటికి కష్టంగా ఉన్నది.

ఇవి కూడా చ‌ద‌వండి..

జెండా ఏర్పాటు పనిలో ప్రమాదం : ముగ్గురు మృతి

ప్రతి ఒక్కరూ గౌరవంగా బతికేలా చూడాలి : వెంకయ్యనాయుడు

ఈ గోల్డ్‌ మెడలిస్ట్‌ కష్టాలు తీరెదెలా..?

పనుల్లో బిజీగా ఉన్నారా? ఈ ఆహారాలతో ఆరోగ్యం పొందండి!

టీ20 వరల్డ్‌ కప్‌కు ఐసీసీ మార్గదర్శకాలు

తాలిబాన్లకు పాక్‌ జనరల్స్‌ మద్దతు : మాజీ ఎంపీ ఆరోపణ

ఆఫ్ఘాన్‌ నుంచి పౌరుల తరలింపు మొదలెట్టిన అమెరికా

ఇంగ్లండ్‌లో తుపాకీ కాల్పులు.. ఆరుగురు మృతి

సరిహద్దు గాంధీకి ‘భారతరత్న’

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement