Venezuela Earthquakes: 40 సెకన్ల తేడాలో రెండు భూకంపాలు.. 32 మంది మృతి, 700 మందికి గాయాలు
Venezuela Earthquakes: వెనిజువెలాలో రెండు సార్లు భారీ భూకంపం సంభవించింది. నిమిషం తేడాలో ఆ భూకంపాలు నమోదు అయ్యాయి. అయితే ఆ భూకంపాల వల్ల 32 మంది మృతిచెందగా, 700 మంది గాయపడినట్లు ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగేజ్ తెలిపారు.
కారకాస్: వెనిజువెలాలో ఇవాళ కేవలం నిమిషం తేడాలో రెండు సార్లు భారీ భూకంపం(Venezuela Earthquakes) వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ భూకంపాల వల్ల 32 మంది మృతిచెందగా, 700 మంది గాయపడినట్లు ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగేజ్ తెలిపారు. బుధవారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటల సమయంలో వెనిజువెలాలో రెండు సార్లు భూమి కంపించింది. తొలుత రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.2 కాగా, ఆ తర్వాత 7.5 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. ఆ భూకంపాల ధాటికి భారీ బిల్డింగ్లు నేలమట్టం అయ్యాయి. లా గౌరియా ప్రాంతం తీవ్రంగా ప్రభావానినికి గురైంది.
డజన్ల సంఖ్యలో బిల్డింగ్లు కూలాయని, వీలైనంత వరకు అందర్నీ రక్షిస్తున్నామని, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని, లా గౌరియా రాష్ట్రంలో పరిస్థితి భయానకంగా ఉందని అధ్యక్షురాలు రోడ్రిగేజ్ తెలిపారు. దేశ రాజధాని కారకాస్‌కు పశ్చిమ దిశలో 168 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీబియన్ తీరంలోని మోరన్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. సుమారు 22 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు పేర్కొన్నారు. దాదాపు శతాబ్ధ కాలం తర్వాత వెనిజువెలాలో భారీ భూకంపం సంభవించింది.
మృతుల సంఖ్య లక్ష వరకు చేరుకునే అవకాశాలు ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

