న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశం కాంగోలో (Congo) ఘోర ప్రమాదం జరిగింది. రాగి గనిలో (Copper Mine) వంతెన కుప్పకూలింది. దీంతో 32 మంది మృతి చెందారు. కాంగోలోని లువాలాబా ప్రావిన్స్‌లోని కలాండో సైట్లో (Kalando site) రాగి గని ఉంది. ఈ మైనింగ్ సైట్లో వందలమంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మైనింగ్ వద్ద కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుకైన వంతెనపై కార్మికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో అది కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం ఇప్పటివరకు సుమారు 32 మంది చనిపోయారని మైనింగ్ ఏజెన్సీ తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. కాంగోలో ఈ ఏడాది జరిగిన అతిపెద్ద మైనింగ్ ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది.
కాగా, 49 మంది మరణించారని, మరో 20 మంది దవాఖానాలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని రాయిటర్స్ వర్గాలు పేర్కొన్నాయి. కాంగోలో మైనింగ్ గని ముఖ్యమైన జీవనాధారం. దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల మంది ఈ గని ద్వారా ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా లక్షలాది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. అయితే కనీస భద్రతా చర్యలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
At least 32 people have died after a collapse at a cobalt mine in southeastern DR Congo, authorities say.
A bridge at the site gave way, killing dozens of informal miners in Lualaba province.#DRC #Congo #Mining pic.twitter.com/bdcNrBndpI
— Cyrus (@Cyrus_In_The_X) November 16, 2025