కీవ్: రష్యా చేస్తున్న దాడులతో 198 మంది ఉక్రేనియన్లు మృతిచెందినట్లు ఆ దేశానికి చెందిన ఆరోగ్యశాఖ మంత్రి విక్టర్ లియాష్కో వెల్లడించారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. గురువారం నుంచి ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఫేస్బుక్ పేజీలో లియాష్కో ఓ పోస్టు పెట్టారు. రష్యా దాడిలో ఇప్పటి వరకు 1115 మంది ఉక్రేనియన్లు గాయపడినట్లు తెలిపారు. మూడు రోజుల్లో 33 మంది చిన్నారులు కూడా గాయపడ్డారు. ఉక్రెయిన్ దళాలు చేస్తున్న ప్రతిఘటనతో రష్యా బలగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.