టెక్సాస్ : చంద్రుడి చుట్టూ రెండుసార్లు చక్కర్లు కొట్టిన ప్రఖ్యాత ఆస్ట్రోనాట్ జిమ్ లోవెల్(Astronaut Jim Lovell) ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 97 ఏళ్లు. నాసాకు చెందిన ఆస్ట్రోనాట్ జిమ్ లోవెల్.. అపోలో 13 మిషన్‌కు కమాండర్‌గా చేశారు. 1970లో ఆ మిషన్ చేపట్టారు. అయితే ఆ వ్యోమనౌక రోదసిలోకి వెళ్లిన రెండు రోజులకు తీవ్ర ప్రమాదానికి లోనైంది. వ్యోమనౌకలో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో.. అపోలో 13 మిషన్ ప్రమాదంలో పడింది. భూమికి వేల మైళ్ల దూరంలో ఉన్న సమయంలో ఆ ఘటన జరిగింది. కానీ కమాండర్ జిమ్ లోవెల్ చాలా నైపుణ్యంతో అపోలో 13 వ్యోమనౌకను సురక్షితంగా భూమ్మీదకు తీసుకువచ్చారు. మరో ఇద్దరు వ్యోమగాములతో పాటు పసిఫిక్ సముద్రంలో లోవెల్ దిగడాన్ని అప్పట్లో వేలాది మంది ప్రేక్షకులు టీవీలో వీక్షించారు. అపోలో 8 మిషన్‌లో కూడా జిమ్ లోవెల్ భాగస్వామిగా ఉన్నారు. రెండు సార్లు చంద్రుడి వద్దకు వెళ్లిన అతను మాత్రం అక్కడ ల్యాండ్ కాలేదు. అమెరికా అంతరిక్ష కార్యక్రమాలకు జిమ్ ఎంతో ప్రోత్సహం ఇచ్చినట్లు నాసా తాత్కాలిక చీఫ్ సీన్ డఫీ తెలిపారు.
చిన్నతనం నుంచి రాకెట్లపై జిమ్ దృష్టిపెట్టాడు. టీనేజ్‌లో స్వయంగా అతను రాకెట్‌ను తయారు చేశాడు. అతని పూర్తి పేరు జేమ్స్ ఆర్థర్ లోవెల్ జూనియర్. 1928 మార్చి 25వ తేదీన జన్మించాడు. అబ్బాయిలకు డైనోసర్లు లేదా విమానాలు నచ్చుతాయని చెప్పేవాడతను. అయితే తనకు విమానాలంటే ఇష్టమనేవాడు. అయిదేళ్ల వయసులో అతని తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తల్లి అతన్ని పెంచిపోషించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా నేవీలో చేరాడు. కొత్త పైలట్ల వేటలో ఉన్న నేవీకి అతను దొరికాడు. ఫైటర్ పైలట్‌గా అతను శిక్షణ పొందాడు.
రాకెట్లపై ఉన్న మోజుతో జిమ్ రెండేళ్లలోనే అన్నాపోలీస్‌లో ఉన్న నేవీ అకాడమీలో చేరాడు. తనతో పాటు హైస్కూల్ చదువుకున్న మారిలిన్ గెర్లాచ్ను అతను పెళ్లి చేసుకున్నాడు. వాస్తవానికి శిక్షణ సమయంలో పెళ్లి, గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఎంకరేజ్ చేయరు. కానీ మారిలిన్ అతని కోసం ఎదురుచూసింది. 1952లో గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత అతను ఆమెను పెళ్లాడాడు. 70 ఏళ్లు కలిసి జీవించారు. 2023లో జిమ్ భార్య మారిలిన్ కన్నుమూసింది.
A statement from the family of Apollo astronaut Jim Lovell on his passing:
“We are saddened to announce the passing of our beloved father, USN Captain James A. “Jim” Lovell, a Navy pilot and officer, astronaut, leader, and space explorer. He was 97.
We are enormously proud of… pic.twitter.com/rz6kbvJ9oa
— NASA (@NASA) August 8, 2025