Asteroid | విశ్వంలో గ్రహశకలం దూసుకెళ్తుంటాయి. వీటికి స్థిరమైన మార్గం, గమ్యం లేకుండా సంచరిస్తుంటాయి. వీటి నుంచి భూమికి ముప్పు పెంచి ఉన్నది. ఇప్పటికే గ్రహశకలాలు భూమి దిశగా దూసుకువచ్చి మండిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. చిన్న చిన్న గ్రహశకలాలు కావడంతో ప్రమాదం తప్పినట్లయ్యింది. అయితే, భారీ గ్రహశకలాలు భూమిని ఢీకొడితే విధ్వంసం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తాజాగా భారీ గ్రహశకలం భూమికి దగ్గరగా రాబోతున్నది. ఈ గ్రహశలం పేరు అపోఫిస్. దీనికి ‘గాడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్’ పేరు కూడా ఉన్నది. ఈ గ్రహశకలానికి ఈజిప్ట్‌కు చెందిన అపెప్ దేవుడి పేరు పెట్టారు. అయితే, ఈ ఆస్టరాయిడ్ 2029లో భూమికి అత్యంత సమీపంలోకి రానున్నది.
కేవలం 30,600 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుందని పేర్కొన్నారు. ఈ గ్రహశకలాన్ని నేరుగా కంటితో చూడవచ్చని చెప్పారు. అపోఫిస్ ఆస్టరాయిడ్ మరికొన్ని చిన్న గ్రహశకలాలను ఢీకొట్టుకుంటూ వెళ్తే తన మార్గాన్ని మార్చుకునేందుకు అవకాశం ఉందని తాజాగా పరిశోధనల్లో తేలిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో భూమి వాతావరణంలోకి ప్రవేశించే అవకాశాలు లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆస్టరాయిడ్ 1230 అడుగుల వెడెల్పు.. దాదాపు మూడున్నర ఫుట్‌బాల్ మైదానాల విస్తీర్ణానికి సమానంగా ఉంటుందని పేర్కొన్నారు. దాంతో ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటే భారీ విధ్వంసం ఏర్పడుతుందని.. అయితే, ఇలా జరిగేందుకు చాలా తక్కువ అవకాశాలు మాత్రమే ఉన్నాయన్నారు. ఇందులో ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదన్నారు. గ్రహశకలం భూమిని తాకే అవకాశాలు చాలా తక్కువ అని అధ్యయనం రచయిత యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ అంటారియో ఖగోళశాస్త్రవేత్త పాల్ వీగెర్ట్ పేర్కొన్నారు.
2029లో.. ఆ తర్వాత భవిష్యత్‌లో భూమిని ఢీకొట్టే మార్గంలో మరో గ్రహశకలం అపోఫిస్ను ఢీకొట్టే అవకాశం మిలియన్లో ఒకటి మాత్రమేనని.. చిన్న గ్రహశకలమైనా అపోఫిస్ మార్గాన్ని ప్రమాదకరంగా మారుస్తుందని పేర్కొన్నారు. ఈ గ్రహశకలం 2029లో భూమికి దగ్గరగా వస్తుందని.. ఈ క్రమంలో చిన్న గ్రహశకలాలను ఢీకొట్టే అవకాశం ఉందన్నారు. ఈ గ్రహశకలాన్ని 2004లో గుర్తించారు. ఈ ఆస్ట్రరాయిడ్ భూమిని ఢీకొట్టేందుకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తాకే అవకాశాలు తక్కువగానే ఉన్నా.. ఢీకొట్టే అవకాశాలను తోసిపుచ్చేందుకు అవకాశం లేదన్నారు. ఆస్ట్రాయిడ్ పేరు అపోఫిస్ 99942. ఇది ప్రమాదకరమైన ఆస్ట్రరాయిడ్స్లో అగ్రస్థానంలో ఉన్నది.