ఇస్లామాబాద్: ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సాయుధ దళాల చేతిలో పాకిస్థాన్ సైన్యం ఘోర పరాజయం పాలైన క్రమంలో తాజాగా, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తనకు తానే దేశ రెండో అత్యున్నత సైనిక గౌరవం అయిన హిలాల్-ఎ-జురాత్ను ప్రకటించుకున్నాడు.
భారత సాయుధ దళాల శక్తివంతమైన దాడి నుంచి తమ స్థావరాలు, సైనిక మౌలిక సదుపాయాలను కూడా రక్షించుకోవడంలో విఫలమైన తర్వాత మునీర్ తనకు తానే అవార్డు ప్రకటించడంపై సామాజిక మాధ్యమంలో పెద్దయెత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. రకరకాల మీమ్స్‌ను సృష్టిస్తూ మునీర్ నీకు సిగ్గుందా? ఓడిపోయిన వాడికి అవార్డులా? అంటూ నెటిజన్లు నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతున్నారు.