Pakistan | ఇస్లామాబాద్: పాకిస్థాన్ 14వ అధ్యక్షుడిగా అసిఫ్ అలీ జర్దారీ (68) శనివారం ఎన్నికయ్యారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కో చైర్మన్ అయిన ఆయన దేశాధ్యక్ష పదవిని చేపడుతుండటం ఇది రెండోసారి. పీపీపీ, పీఎంఎల్-ఎన్ మద్దతుతో పోటీ చేసిన ఆయన సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ అభ్యర్థి మహమూద్ ఖాన్ అచక్జాయ్ (75)ను ఓడించారు.
జర్దారీకి 255 ఓట్లు, మహమూద్‌కు 119 ఓట్లు లభించాయి.