న్యూయార్క్: భారతీయ సంతతికి చెందిన అరుణ్ సుబ్రమణియన్(Arun Subramanian).. అమెరికాలో జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. న్యూయార్క్ దక్షిణ జిల్లా(Southern District of Newyork) జడ్జిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. న్యూయార్క్ బెంచ్‌లో జడ్జిగా సేవలు అందించనున్న తొలి సౌత్ ఏషియా జడ్జిగా ఆయన నిలుస్తారు. 58-37 ఓట్ల తేడాతో ఆయన నామినేషన్ కన్ఫర్మ్ అయ్యింది.
పెన్సిల్వేనియా(Pennsylvania)లోని పిట్స్‌బర్గ్‌లో ఆయన 1979లో జన్మించారు. 1970 దశకంలో ఆయన పేరెంట్స్ అమెరికా వలసవెళ్లారు. సుబ్రమణియన్ తండ్రి పలు కంపెనీల్లో కంట్రోల్ సిస్టమ్స్ ఇంజినీర్‌గా చేశారు. ఆయన తల్లి కూడా అనేక ఉద్యోగాలు చేశారు. బుక్‌కీపర్‌గా కూడా ఆమె పనిచేశారు.