ఫొటోలో కనిపిస్తున్న కారు పేరు అపోలో ఆర్టీ6. చైనాకు చెందిన టెక్ దిగ్గజం బైడూ కంపెనీ గురువారం ఈ కారును ఆవిష్కరించింది. డ్రైవర్ అవసరంలేకుండా సొంతంగా ప్రయాణించే రోబో ట్యాక్సీ ఇది. స్టీరింగ్ కూడా ఉండదు. 38 సెన్సార్ల సాయంతో పరిసరాలను గమనిస్తూ ప్రయాణం సాగిస్తుంది.
ధర. 37,313 డాలర్లు (రూ. 29.8 లక్షలు). గతంలో ఆవిష్కరించిన మోడల్ కంటే అపోలో ఆర్టీ6 ధర 50 శాతం తక్కువ అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వచ్చే ఏడాది మార్కెట్లోకి ఈ కారు రానున్నది.