లండన్: జాతి వివక్ష వ్యతిరేక నిరసనకారులు బ్రిటన్‌లోని లండన్, తదితర నగరాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. గత వారంలో రైట్‌వింగ్ గ్రూపులు వలసదారులకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలను తిప్పికొట్టేందుకు ఈ ప్రదర్శనలు జరిగాయి. వివిధ వర్గాలకు చెందినవారు ఐకమత్యాన్ని ప్రదర్శించారని నిర్వాహకులు తెలిపారు. నిరసనకారులు ‘స్మాష్ ఫాసిజం అండ్ రేసిజం’, ‘స్టాప్ ది ఫార్ రైట్’ అనే నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు. జాత్యహంకారం, ఇస్లామోఫోబియాలకు వ్యతిరేకంగా ఐకమత్యంగా నిలిచిన ప్రజలకు, లండన్‌వాసులకు రక్షణ కల్పించడంలో పగలు, రాత్రి శ్రమిస్తున్న పోలీసులకు ధన్యవాదాలు అని లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ఎక్స్‌లో పోస్ట్‌చేశారు.