శాన్ఫ్రాన్సిస్కో : కృత్రిమ మేధ (ఏఐ)తో ఉద్యోగం పోగొట్టుకున్నారా? చాట్‌జీపీటీ, బార్డ్ వచ్చాక ఉపాధి అవకాశాలు దొరకడం లేదా? చింతించకండి. ఉద్యోగాన్ని పోగొట్టిన ఏఐయే ఉపాధి కల్పిస్తున్నది.
శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ఆంత్రోపిక్ గెయిన్డ్ అటెన్షన్ అనే కంపెనీ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ పేరిట ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. ఏడాదికి రూ.2.7 కోట్ల వేతనాన్ని కూడా ఆఫర్ చేసింది. వినియోగదారుల ప్రశ్నలకు చాట్‌జీపీటీ సరైన సమాధానాలు అందించేలా ప్రాంప్ట్‌లను రూపొందించడమే మీ పని.