MT Jalveer: భారత నౌక ఎంటీ జల్వీర్పై అటాక్.. ఒమన్ తీరంలో మరో ఘటన
MT Jalveer : హోర్మూజ్ సంక్షోభం భారతీయ నావికులకు ప్రాణ గండంగా మారింది. ఇవాళ మరో భారతీయ నౌక ఎంటీ జలవీర్పై అటాక్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆ వాణిజ్య నౌకలో సుమారు 20 మంది భారత నావికులు ఉన్నారు. ఆ ఘటన పట్ల ఒమన్ ఎంబసీ ఆరా తీస్తున్నది.
న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన మరో వాణిజ్య నౌక ఎంటీ జల్వీర్(MT Jalveer)పై ఇవాళ అటాక్ జరిగింది. ఒమన్ తీరంలో ఆ నౌకపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆ నౌకలో సుమారు 20 మంది భారతీయ నావికులు ఉన్నారు. నౌక నుంచి భారీ ఎత్తున నల్లటి పొగ విస్తరిస్తోంది. బహుశా డ్రోన్ దాడి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటన పట్ల ఇంకా పూర్తిగా విషయాలు తెలియడం లేదని ఒమన్‌లోని భారతీయ ఎంబసీ పేర్కొన్నది. స్థానిక అధికారులతో దీనిపై సమాచారం సేకరిస్తున్నట్లు ఎంబసీ వెల్లడించింది. ఒమన్‌లోని సిన్హాస్ పోర్టు సమీపంలో ఘటన జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అమెరికా-ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం వల్ల హోర్ముజ్ జలసంధిలో ప్రస్తుతం ఉద్రిక్తకర వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.
సుమారు 18 టార్గెట్లపై అటాక్ చేసినట్లు తాజాగా ఐఆర్జీసీ పేర్కొన్నది. జోర్డాన్, కువైట్, బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా స్థావరాలపై దాడి చేసినట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. జోర్డాన్ అల్ అజ్రక్ ఎయిర్‌బేస్‌పై 12 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఐఆర్జీసీ తెలిపింది. అక్కడ అమెరికా తన జెట్స్‌ను స్టేషన్ చేసింది. ఎఫ్-15, ఎఫ్-16, ఎఫ్-35 విమానాలు అక్కడ ఉన్నట్లు తెలిసింది. తమ దాడిలో అమెరికాకు చెందిన అనేక యుద్ధ విమానాలు ధ్వంసం అయినట్లు ఇరాన్ పేర్కొన్నది. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఆపరేషన్ చేపట్టినట్లు ఇరాన్ తెలిపింది.
please confirm 20 Indian Seafarers on board and if vessel is M.T. Jalveer ? @Indemb_Muscat https://t.co/s8eAIh8G06 pic.twitter.com/9WnCnuku8P
— FSUI (@FSUIINDIA) June 11, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

