తమ పిల్లలకు ట్రాన్స్‌జెండర్ పాఠాలు చెప్తున్నారంటూ ముగ్గురు తల్లులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంలో సదరు స్కూల్‌పై కేసు వేశారు. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో వెలుగు చూసింది. మౌంట్ లెబనాన్ స్కూల్లో ఫస్ట్‌గ్రేడ్ చదువుతున్న తమ పిల్లలకు ఒక టీచర్.. ట్రాన్స్‌జెండర్ పాఠాలు చెప్తున్నట్లు ఆ తల్లులకు తెలిసింది.
దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ తల్లులు.. పేరెంట్స్ హక్కులను ఆ స్కూల్ టీచర్ ఉల్లంఘించారని, అసలు వాటిని పట్టించుకోలేదని వాదిస్తున్నారు. అలాగే స్థానిక చట్టాలను కూడా ఈ చర్యలు తుంగలో తొక్కుతున్నాయని ఆ తల్లుల ఆరోపణ. అయితే ఈ ఆరోపణలేవీ వాస్తవాలు కాదని, పూర్తి వివరాలు తెలియకుండా ఆ తల్లులు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని స్కూల్ తరఫున ప్రతినిధి చెప్తున్నారు.