టొరంటో, జూన్ 18: కెనడాలో భారతీయ సంతతి వ్యక్తి జస్టిస్ మహమూద్ జమాల్ ఆ దేశ సుప్రీంకోర్టుకు నామినేట్ అయ్యారు. ఆ పదవిని చేపట్టనున్న తొలి శ్వేత జాతియేతర వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ మేరకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందిస్తూ.. ‘కెనడా సుప్రీంకోర్టుకు జమాల్‌ను నామినేట్ చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నా. జస్టిస్ జమాల్కున్న అసాధారణమైన న్యాయ అనుభవం ప్రజలకు సేవ చేయడంలో ఎంతో తోడ్పడుతుంది’ అని అన్నారు.