Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు (Economists) రాబర్ట్ ఈ హాల్ (Robert Hall), మైఖేల్ వుడ్‌ఫోర్డ్ (Michael Woodford) కు 2026 ఏడాదికిగాను ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి (Nobel Prize) ప్రకటించారు. స్థూల ఆర్థికవ్యవస్థ (Economy) లో ఒడుదొడుకులను నియంత్రించేందుకు ఉపయోగపడే నమూనాల రూపకల్పనకు అవసరమైన సూక్ష్మ ఆర్థిక పునాదులపై వారు చేసిన పరిశోధనకు ఈ పురస్కారం దక్కింది.
Nobel prize : అమెరికా ఆర్థికవేత్తలు (Economists) రాబర్ట్ ఈ హాల్ (Robert Hall), మైఖేల్ వుడ్‌ఫోర్డ్ (Michael Woodford) కు 2026 ఏడాదికిగాను ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి (Nobel Prize) ప్రకటించారు. స్థూల ఆర్థికవ్యవస్థ (Economy) లో ఒడుదొడుకులను నియంత్రించేందుకు ఉపయోగపడే నమూనాల రూపకల్పనకు అవసరమైన సూక్ష్మ ఆర్థిక పునాదులపై వారు చేసిన పరిశోధనకు ఈ పురస్కారం దక్కింది.
స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సోమవారం ఈ విషయాన్ని ప్రకటించింది. రాబర్ట్ ఈ హాల్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మైఖేల్ వుడ్‌ఫోర్డ్ కొలంబియా యూనివర్సిటీలో రాజకీయ ఆర్థికశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. వీరి పరిశోధనలు ఆర్థికవ్యవస్థలో వృద్ధి, మాంద్యం వంటి పరిస్థితులను ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు తోడ్పడతాయి.
ఆర్థికవ్యవస్థలో చోటుచేసుకునే మార్పులను అర్థం చేసుకుని తగిన విధాన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ అధ్యయనాలు కీలకంగా నిలుస్తాయి. ఆర్థిక శాస్త్రంలో ఈ పురస్కారాన్ని అధికారికంగా ‘ఆల్ఫ్రెడ్ నోబెల్ స్మారకార్థం స్వెరిజెస్ రిక్స్ బ్యాంక్ ఆర్థిక శాస్త్ర బహుమతి’ అని పిలుస్తారు. స్వీడన్ కేంద్ర బ్యాంకు 1968లో దీన్ని ఏర్పాటుచేసింది. 1969లో తొలిసారిగా ప్రదానం చేశారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ తన వీలునామాలో పేర్కొన్న అసలు ఐదు నోబెల్ బహుమతుల్లో ఆర్థికశాస్త్ర పురస్కారం లేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

