రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండర్-13 బాలికల సాఫ్ట్‌బాల్ జట్టు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి ద్వితీయ స్థానం సాధించింది. నిజామాబాద్‌లో ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర అండర్-13 బాలికల మినీ సబ్ జూనియర్ అంతర్‌జిల్లాల సాఫ్ట్‌బాల్...
– సత్తా చాటిన అండర్-13 బాలికల జట్టు
కొత్తగూడెం, అక్టోబర్ 12 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండర్-13 బాలికల సాఫ్ట్‌బాల్ జట్టు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి ద్వితీయ స్థానం సాధించింది. నిజామాబాద్‌లో ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర అండర్-13 బాలికల మినీ సబ్ జూనియర్ అంతర్‌జిల్లాల సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో జిల్లా జట్టు రన్నరప్‌గా నిలిచి గర్వకారణంగా నిలిచింది. ఈ పోటీల్లో బాలికల పట్టుదల, క్రీడా స్ఫూర్తి, సమష్టి కృషితో అద్భుత ప్రతిభ కనబరిచారు. క్రీడాకారిణుల కఠోర శ్రమతో పాటు భద్రాద్రి కొత్తగూడెం కోచ్ పొన్నవల పృథ్వీరాజ్ శిక్షణ, జట్టు సమన్వయం ఈ విజయానికి దోహదపడ్డాయి.
విజేత జట్టుకు ప్రముఖుల అభినందనలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానం సాధించడంపై తెలంగాణ సాఫ్ట్‌బాల్ కార్యదర్శి కె.నవీన్ కుమార్, భారత సాఫ్ట్‌బాల్ జాయింట్ సెక్రటరీ కె.శోభన్‌బాబు, నిజామాబాద్ సాఫ్ట్‌బాల్ కార్యదర్శి గంగామోహన్ హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాకారిణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా జట్టు సాధించిన ఈ విజయం ఇతర క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ అభినందించారు.

రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

