న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో (New Jersey) విషాదం చోటుచేసుకున్నది. భర్త, ఇద్దరు కూతుళ్లను తుపాకీతో కాల్చిన చంపిన మహిళ.. అనంతరం తానూ ఆత్మహత్య (Murder-Suicide) చేసుకున్నది. న్యూజెర్సీలోని లిన్క్రెస్ట్ టెర్రస్‌లో ఉన్న సబర్బన్ ఇంటిలో రుబెన్ అలర్కన్ (Ruben Alarcon), ఆండ్రియా అలర్కన్ (Andrea Alarcon) దంపతులు నివసిస్తున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు స్కార్లెట్, ఎమ్మా ఉన్నారు. అయితే మొదట తన భర్త, ఇద్దరు కుమార్తెలను తుపాకీ కాల్చి చంపిన ఆండ్రియా.. తర్వాత తానూ కాల్చుకుని బలవన్మరణం చెందింది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆండ్రియా పక్కనే తుపాకీ ఉండటంతో వారిని హత్యచేసి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నదని తెలిపారు. అయితే దీనికి గల కారణం ఏంటనే విషయం తెలియదని చెప్పారు. కాగా, గతేడాది నవంబర్‌లో జరిగిన వేలంలో 3,22,000 డాలర్లకు తమ ఇంటిని కోల్పోయారు. దీంతో ఇంటిని ఖాళీ చేయడానికి 60 రోజుల సమయం.. ఈ నెలాఖరుతో ముగినుంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా చనిపోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందని యూనియన్ కౌంటీ ప్రాసిక్యూటర్ విలియమ్ డానియల్ అన్నారు.