వాషింగ్టన్, నవంబర్ 18: కొలెస్ట్రాల్‌ను తగ్గించే కొత్తమందును అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎలుకల వంటి జంతువులలో అది 70 శాతం కొలెస్ట్రాల్‌ను తగ్గించినట్టు పరిశోధనల్లో రుజువైంది. సెల్ రిపోర్ట్స్ సైన్స్ జర్నల్ తాజా సంచికలో ఈ పరిశోధన ఫలితాలను ప్రచురించారు. కొలెస్ట్రాల్‌తో పాటుగా క్యాన్సర్ చికిత్సల్లో ఈ పరిశోధన ఉపకరించవచ్చని అంటున్నారు.
కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ప్రస్తుతం పీసీఎస్‌కే9 ఇన్హిబిటర్ను ఇంజక్షన్ రూపంలో మాత్రమే ఇవ్వడానికి వీలవుతుంది. కొత్తగా కనిపెట్టిన మందును గోలీలు, సిరప్ రూపంలో నోటి ద్వారా ఇవ్వవచ్చు. గుండెజబ్బులు రాకుండా కాపాడాలంటే కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ఒక్కటే సరైన మార్గం. తాజాగా కనిపెట్టిన మందు సులభంగా కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని ప్రొఫెసర్ జొనాథన్ ఎస్ స్టామ్లర్ పేర్కొన్నారు.