Solar Car | వాషింగ్టన్, నవంబర్ 4 : ఒక్కసారి బ్యాటరీ చార్జింగ్‌తో 1,600 కిలోమీటర్లు (వెయ్యి మైళ్లు) ప్రయాణించగల సౌర విద్యు త్తు కారును తీసుకొస్తున్నట్టు అమెరికాకు చెందిన విద్యుత్తు కార్ల తయారీ కంపెనీ ప్రకటించింది. శాన్‌డియాగోకు చెందిన ‘అప్టేరా మోటార్స్’ అభివృద్ధి చేసిన సౌర విద్యుత్తు కారు ‘పీఐ 2’.. తొలి టెస్టింగ్‌లో అనూహ్య ఫలితాలు అందుకున్నట్టు కంపెనీ వర్గాలు తాజాగా వెల్లడించాయి.
‘పీఐ 2’ మొదటి టెస్ట్ డ్రైవ్ సక్సెస్ అయినట్టు తెలిపింది. కారు బాడీతో అనుసంధానం చేసిన సోలార్ ప్యానెల్స్‌తో రోజుకు కనీసం 40 మైళ్ల (63 కిలోమీటర్లు) వరకు ప్రయాణించగలగటం దీని ప్రత్యేకత. అటు తర్వాత బ్యాటరీ ప్యాక్‌తో కారు నడుస్తుంది. సౌర శక్తితో ఏడాదికి 11 వేల మైళ్ల డ్రైవింగ్ అందిస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ‘పీఐ 2’ తదుపరి పరీక్షలకు సిద్ధం అవుతున్నట్టు తెలిసింది.