అమెరికాను మరో దెబ్బ తీసినట్టు ఇరాన్ ప్రకటించింది. యూఎస్ నౌక ఎల్హెచ్ఏ-7పై దాడి చేయడంతో అది దక్షిణ హిందూ మహాసముద్రంలోకి పలాయనం చిత్తగించిందని ఐఆర్జీసీ ప్రకటించింది. ఇజ్రాయెల్ ఎస్డీఎన్7 కంటైనర్ షిప్ను కూడా ధ్వంసం చేశామని తెలిపింది.
ఆ దాడి ఎక్కడ చేసిందీ వివరించ లేదు. యూఎస్ఎస్ ట్రిపోలీగా కూడా పిలిచే ఎల్హెచ్ఏ-7 నౌక మార్చి మొదటి వారంలో పెద్దయెత్తున సైన్యంతో పశ్చిమాసియాలోకి అడుగుపెట్టింది. అయితే తమ యుద్ధ నౌకపై ఇరాన్ దాడి చేసిందీ లేనిదీ అమెరికా నిర్ధారించ లేదు.