Oldest Newlywed Couple | న్యూఢిల్లీ: అమెరికన్ శతాధిక వృద్ధులు బెర్నీ లిట్మన్ (100), మర్జోరీ ఫిటర్మన్ (102) ప్రేమకు వయసు అడ్డుకాదని నిరూపించి, గిన్నిస్ రికార్డు సృష్టించారు. వీరిద్దరూ దాదాపు పదేళ్ల నుంచి ప్రేమించుకుంటూ మేలో పెండ్లి చేసుకున్నారు. దీంతో ప్రపంచంలో అత్యధిక వయసు గల నవ దంపతులుగా ఘనత సాధించారని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది.
బెర్నీ, మర్జోరీలకు గతంలో వేర్వేరుగా వివాహాలు జరిగాయి. వారి జీవిత భాగస్వాములు మరణించారు. అనంతరం వీరిద్దరూ ఫిలడెల్ఫియాలో ఉన్న ఓ వృద్దాశ్రమంలో చేరారు. అక్కడ కాస్ట్యూ మ్ పార్టీలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రేమ, సాహచర్యం, సంతోషాలను పొందడానికి వయసుతో పని లేదని వీరిద్దరూ నిరూపించారు. అంతకుముందు ఇద్దరు శతాధిక వృద్ధులు పెండ్లి చేసుకుని సృష్టించిన రికార్డును వీరు చెరిపేశారు.