Elon Musk | వాషింగ్టన్: అమెరికాలో రోజురోజుకు పెరుగుతున్న జాతీయ రుణ భారంపై ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఆల్-ఇన్-పాడ్కాస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమెరికా వేగంగా దివాలా దిశగా వెళ్తున్నదని అన్నారు. అమెరికాలో నెలకొన్న ఆర్థిక సవాళ్లపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, రోజురోజుకు జాతీయ రుణం, వడ్డీల చెల్లింపు భారం అధికమవుతున్నదని చెప్పారు. దేశం చేసిన రుణాలపై వడ్డీలే ఈ ఏడాది ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని, దేశంలో వసూలు చేసిన పన్నుల్లో 76% వాటి చెల్లింపులకే సరిపోతున్నదని తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే అమెరికా దివాలా తీస్తుందని చెప్పారు.