Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన సివిల్ ఫ్రాడ్ కేసు విచారణ ముగింది. వచ్చే ఏడాది జనవరిలో కేసుపై తీర్పును వెలువరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ రుణదాతలను మోసం చేయడానికి తన నికర విలువను తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. ఫ్రాడ్ కేసులో డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలితే.. 250 మిలియన్ డాలర్ల భారీ జరిమానా విధించే అవకాశాలున్నాయి. అదే సమయంలో న్యూయార్క్‌లో వ్యాపారం చేయకుండా నిషేధించే అవకాశాలు సైతం ఉన్నాయి. 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్న ట్రంప్‌కు ఇది పెద్ద దెబ్బలాంటిదే. అయితే, అయితే తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేస్తున్న ట్రంప్.. తానేమీ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ సమాచారం మేరకు ఫ్రాడ్ కేసును విచారిస్తున్న జస్టిస్ ఆర్థర్ అంగోరాన్ జనవరి 11న తీర్పును జనవరి 11, 2024న వెల్లడించే అవకాశం ఉంది.
విచారణలో ట్రంప్ మోసం పూర్తిగా వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిషియా జేమ్స్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదే సమయంలో ట్రంప్ తరఫు న్యాయవాది క్రిస్ కిస్సే మాట్లాడుతూ 11 వారాల సుదీర్ఘ విచారణలో ఎలాంటి మోసం జరుగలేదని.. ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టమైందని తెలిపారు. అయితే, ట్రంప్ పత్రాల్లో అవకతవకలు ఉన్నాయని అంగోరాన్ పేర్కొన్నారు. నవంబర్‌లో వాంగ్మూలం నమోదు చేసిన సమయంలో ట్రంప్ ఫైనాన్సియల్ రిపోర్టుల్లోని ఆస్తి విలువ తప్పని అంగీకరించారు. అయితే, ఆస్తి విలువ బ్యాంకుల మందిపుపై ఎలాంటి ప్రభావం చూపలేదన్నారు. సివిల్ ఫ్రాడ్ కేసు అక్టోబర్ 2న ప్రారంభమైంది. న్యూయార్క్ అటార్నీ జనరల్ జేమ్స్, జడ్జి అంగోరాన్ రాజకీయ పగతో తనపై పక్షపాతంగా చర్యలు తీసుకుంటున్నారని ట్రంప్ ఆరోపించారు.