జోహెన్నెస్‌బర్గ్: అమెరికా ఆపేందుకు ప్రయత్నించినా జి-20 సదస్సు డిక్లరేషన్‌కు సభ్య దేశాల అధినేతలు శనివారం ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా అంతర్జాతీయ సంబంధాలు, సహకార మంత్రి లామోలా మాట్లాడుతూ ‘ఇవి మాకు గొప్ప క్షణాలు.. ఈ నిర్ణయం ఆఫ్రికా ఖండాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందని నమ్ముతున్నాం’ అని పేర్కొన్నారు.
అయితే సాధారణంగా డిక్లరేషన్‌ను సమావేశాల చివరి రోజు తీసుకుంటారు. ఈసారి సమావేశాలను ప్రారంభించిన రోజే తీసుకోవడంపై ఆయన స్పందిస్తూ ‘మేం ఆశ్చర్యపోయాం.. దేశాధినేతలందరూ కలిసికట్టుగా ఆమోదించారు.. ఇది ఒక్క ఆఫ్రికాకే కాదు.. ప్రపంచమంతా విప్లవాత్మక మార్పును విస్తరిస్తుంది అని భావిస్తున్నాం’ అని తెలిపారు.