Russia-Ukraine War | రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు అమెరికాకు ఇష్టం లేదా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తున్నది. పుతిన్‌పై పైచేయి సాధించేందుకు అగ్రరాజ్యం ఉక్రెయిన్ను పావుగా వాడుకుంటుందా? సందేహం వ్యక్తమవుతున్నది. ఖేర్సన్ నుంచి దష్యా దళాలను ఉప సంహరించుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ.. అమెరికా 400 మిలియన్ డాలర్ల సైనిక సహాయాన్ని ఉక్రెయిన్‌కు పంపుతున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్ను సైనికపరంగా బలోపేతం చేస్తూ.. తద్వారా రష్యా ఆర్థిక స్థితిని బలహీనపరచడమే అమెరికా ఉద్దేశమని, ఈ విషయం స్పష్టంగా తెలుస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.
అమెరికా సైనిక సహాయంలో ఉక్రెయిన్‌కు పంపుతున్న సైనిక ప్యాకేజీలో ప్యాకేజీ భారీ మొత్తంలో ఆయుధాలున్నాయి. మొదటిసారిగా నాలుగు అత్యంత మొబైల్ అవెంజర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను పంపుతున్నది. ‘హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్’ హిమర్స్ కూడా ఉందని తెలుస్తున్నది. రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ దాన్ని ఇప్పటికే విజయవంతంగా ఉపయోగిస్తున్నది. ప్యాకేజీలో స్టింగర్ మిస్సైల్స్, పదివేల మోర్టార్ షెల్స్, వేల సంఖ్యలో హోవిట్జర్లు, 400 గ్రెనేడ్ లాంచర్లు, వింటర్ ఆర్మీ యూనిఫాంలు, హాక్ సర్ఫేస్-టు-ఎయిర్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ నుంచి తుపాకులు, రైఫిల్స్ ఉన్నాయి. అలాగే రెండుకోట్ల బుల్లెట్లు సైతం ఉన్నాయి.
మరో వైపు యూరోపియన్ కమిషన్ సైతం బుధవారం ఉక్రెయిన్‌కు 2023 కోసం 18 బిలియన్ల ప్యాకేజీని ప్రతిపాదించింది. ఇదిలా ఉండగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఖేర్సన్ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించారు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి రావాలని రష్యా తన సైన్యాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో అమెరికా ఎప్పుడూ పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని, తద్వారా లొంగిపోయే అవకాశం ఉంటుందని భావిస్తున్నది.